బ్యాడ్మింటన్‌కు చురుకుదనం మరియు వేగం అవసరం; క్రికెట్‌లో వ్యూహం మరియు ఓర్పు ఉంటుంది.
Tag: బ్యాడ్మింటన్ ఆట
బ్యాడ్మింటన్ ఆటకు వయోపరిమితి ఉందా?
బ్యాడ్మింటన్ ఆట ఆడేందుకు వయోపరిమితి లేదు. 60 ఏళ్ల వయసులో కూడా చాలా బాగా ఆడే ఆటగాళ్లు వుంటారు. మీరు 23 సంవత్సరాల వయస్సులో బ్యాడ్మింటన్ నేర్చుకోవడం ప్రారంభిస్తే, మీరు సాధారణ ఆటగాడిగా మారవచ్చు; కానీ ప్రొఫెషనల్ ప్లేయర్ అవ్వలేకపోవచ్చు.
బ్యాడ్మింటన్ తో బరువు తగ్గవచ్చా?
బ్యాడ్మింటన్ ఆడడం ద్వారా కేలరీలను బర్న్ చేయడానికి గొప్ప మార్గం. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, మీరు ముందుకు, వెనుకకు, పరుగెత్తడం, ఎగరడం, వంగడం వంటివి చురుకుగా చేస్తుంటారు. రోజూ కనీసం ఒక గంట బ్యాడ్మింటన్ ఆడడం ద్వారా బరువు తగ్గడాన్ని గమనిస్తారు.
నా వయస్సు 18 సంవత్సరాలు. నేను ఒక నెలలో బ్యాడ్మింటన్ ఆట నేర్చుకోవచ్చా?
బ్యాడ్మింటన్ లేదా ఏదైనా ఆట నేర్చుకోవడానికి నిర్ణీత సమయ పరిధి లేదు. మీరు బ్యాడ్మింటన్ ఆట నేర్చుకోవడానికి మూడు లేదా ఆరు నెలలు పట్టవచ్చు కానీ అది అక్కడితో ముగియదు. మీరు ఎల్లప్పుడూ కొత్త పద్ధతులను నేర్చుకుంటూ ఉంటారు.